Amit Shah - Narendra Modi - political Strategy  in Telanganaతెలంగాణాపై బీజేపీ అధినాయకత్వం ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తుంది. తాము గెలవకపోయిన పర్వాలేదు, తెరాస గెలిచినా పర్లేదు కానీ ఎట్టి పరిస్థితులలోను కాంగ్రెస్ మాత్రం గెలవకూడదని మోడీ అమిత్ షా భావిస్తున్నారట. ఇటీవలే అమిత్ షాను కలిసిన ఆ పార్టీ నేతలకు ఆయన డైరెక్ట్ గానే ఈ విషయం చెప్పారట.

కాంగ్రెస్ లో ఈపాటికే బీజేపీ కొందరిని కోవర్టులుగా పెట్టిందట. అవసరమైతే వారిని ప్రయోగించి ఆ పార్టీని నాశనం చేసే ప్రయత్నం చేస్తాదట. మరోపక్క కాంగ్రెస్ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులను అవసరమైతే మరింత రెచ్చగొట్టి రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్థాపించేలా ప్రేరేపించాలని అమిత్ షా వ్యూహం.

తద్వారా కాంగ్రెస్ కు గంపగుత్తుగా పడతాయి అనుకునే రెడ్డి సామాజికవర్గం ఓట్లు చీలిపోతాయని ఆయన అంచనా. గుజరాత్ లో మెరుగైన ప్రదర్శనతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా 2019లో తెలంగాణాలో తమ సత్తా చూపించాలని ఉవ్విల్లూరుతుంది. ఆ పార్టీని బీజేపీ చెట్టు చాటు నుండి బాణం వేసి అడ్డుకోగలదేమో చూడాలి.