Amit Shah - Narendra - Modiరెండు రోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయాలలో పెనుసంచలనానికి తెర లేపుతూ ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ ఉన్నఫళంగా బీజేపీతో చేతులు కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత శరద్ పవర్ శివసేనతో చర్చలు జరుపుతుండగానే ఆయన బీజేపీతో చేతులు కలిపారు. ప్రతిగా ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని పొందారు.

ఇలా ఆయన మద్దతు ఇచ్చారో లేదో మహారాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటిన్చింది. నీటిపారుదల ప్రాజెక్టుల్లో 70,000 కోట్ల అవినీతి జరిగిందని ఆయనపై ఉన్న కేసును ప్రభుత్వం మూసివేసింది. కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో వివిధ నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడంలో అజిత్ 70,000 కోట్ల అవినీతి చేశారని ఆయనపై కేసు నమోదైంది.

తమతో చేతులు కలిపిన వారి కేసులు మాఫీ చెయ్యడం బీజేపీ ప్రభుత్వంలో మనం అనేక సార్లు చూశాం. అయితే మరీ నిసిగ్గుగా రెండు రోజులలోనే ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణం అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. కాగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్‌లో ఈరోజు ఉదయం వాదనలు ముగిశాయి.

24 గంటల్లో ఫడ్నవీస్ ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. దేశంలోనే కీలకమైన రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రను వదులుకోవడానికి మోడీ – అమిత్ షాలు ఏ మాత్రం సిద్ధం గా లేరు.