Amit Shah - Chandrababu Naidu - Suajana Chowdaryవారికి ఇష్టం లేకపోతే ఒక నమస్కారం పెట్టి మా దారి మేము చూసుకుంటాం అన్న చంద్రబాబు వ్యాఖ్యలు బీజేపీ నాయకత్వం మీద పని చేసినట్టుగానే ఉన్నాయి. చర్చలకు రావాలని బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెప్పినట్టు సమాచారం. ఈ సంధర్భంగా టీడీపీ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పే అవకాశం ఉంది.

జమిలి ఎన్నికలపై మిత్రపక్ష నేతల అభిప్రాయాన్ని ప్రధాని కోరారు. దానిపై తమ పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించి తమ వైఖరిని తెలియజేస్తామని సుజనా చౌదరి అన్నారట. విభజన హామీలు, అసెంబ్లీ సీట్ల పెంపు, రాష్ట్ర బీజేపీ నాయకుల పరుష వ్యాఖ్యలు అన్ని చర్చకు రాబోతున్నాయి.

ఈ మీటింగ్ బట్టి, రాబోయే బడ్జెట్ బట్టి టీడీపీ పొత్తు విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దీనిపై ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారట. మరి కొద్దీ రోజులలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది.