Amit Shah asked to merge janasena party into bjpభవిష్యత్తు జాతీయ పార్టీలదేకాని, ప్రాంతీయ పార్టీలది ఉండదని అమిత్ షా అన్నారని, జనసేనను విలీనం చేయాలని అడిగారని, కాని తాను అంగీకరించలేదని జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ ఒంగోలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో అన్నారు. బిజెపిలో చేరడానికి అయితే జనసేన ఎందుకు పెడతానని ఆయన ఎదురు ప్రశ్నించారు.

జాతీయ పార్టీల పాలన సరిగ్గా లేకపోవడం కారణంగానే ప్రాంతీయ పార్టీలు ఉద్భవించాయి. అందుకే తాను జనసేన పార్టీ స్థాపించా అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పోగొట్టుకోనని అన్నారు. ఏ ప్రాంతీయ పార్టీలైతే అండగా ఉన్నాయో,వాటిని విలీనం చేసుకుంటామని బీజేపీ చెప్పడం దారుణం అన్నారు.

ఒకప్పుడు బిజెపికి ఇద్దరు ఎమ్.పిలే ఉండవచ్చని, కాని ఇప్పడు 370 పైగా సాదించారని,ఎప్పుడు అదే ఉండదని,బండ్లు ఓడలు అవుతాయని, ఓడలు బండ్లు అవుతాయని ఆయన అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ పెట్టి రాజకీయ కూలీగా మారాను అని ఆయన చెప్పుకొచ్చారు.