బాలయ్యకో న్యాయం… జూనియర్ కో న్యాయమా?

Balakrishna - Boyapati Srinu Movie Launchజూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీకి 2009 ఎన్నికల తరువాత కొద్ది పాటి అగాధం ఏర్పడిన మాట వాస్తవమే. దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం కష్టమే. అయితే జూనియర్ మాత్రం ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి టీడీపీ గురించి గానీ పార్టీ నాయకత్వం గురించి గానీ తప్పుగా మాట్లాడలేదు. అయితే టీడీపీలోని ఒక వర్గం జూనియర్ ని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంది.

జూనియర్ సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశి, పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు రాజకీయంగా టీడీపీకి వ్యతిరేకంగా వెళ్లిన సమయంలో వారు పదే పదే జూనియర్ బయటకు రావాలని, దానికి సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేసే వారు. వారు చేసినదానికి జూనియర్ ఎందుకు సమాధానం చెప్పాలని మరి కొందరు వాదించేవారు.

తాజగా బాలయ్య కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. దానికి అంబికా కృష్ణ ముహూర్తం షాట్ కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అంబికా కృష్ణ బాలయ్యకు బాగా సన్నిహితుడు అయితే ఆయన ఇటీవలే టీడీపీని వీడి బీజేపీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉండగా ఆయనను చంద్రబాబు ఏపీఎఫ్డీసీ చైర్మన్ గా కూడా చేశారు.

పదవీ కాలం ముగిశాకా, పార్టీ అధికారం పోయాకా పార్టీ మారిపోయారు. అందరి మాదిరిగానే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. మరి అటువంటి ఆయనతో బాలయ్య సంబంధాలు నెరపడం తప్పే కదా? మరి బాలయ్యకో న్యాయం… జూనియర్ కో న్యాయమా? అంటూ జూనియర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Follow @mirchi9 for more User Comments
Disco-Raja-Has-Right-Notes-But-Missing-The---BuzzDon't MissDisco Raja Has Right Notes But Missing The BuzzA new single from Mass Maharaja starrer Disco Raja is out. The man of the...An Electrifying Action Scene For Powerstar Pawan Kalyan's ComebackDon't MissAn Electrifying Action Scene For Powerstar's ComebackPowerstar Pawan Kalyan is all set to enter the movie space with the official remake...Prbhas- movie updateDon't MissPic Talk: The Rebel Star Is Back On Sets While Look Remains A SurpriseThe Indian Rebel Star Prabhas is back on sets. He has commenced shooting for his...Alliance - An Unavoidable Risk for Pawan Kalyan?Don't MissAlliance - An Unavoidable Risk for Pawan Kalyan?Janasena President Pawan Kalyan who has come under severe pressure after the drubbing in the...Mahesh Babu Reveals Venkatesh's SecretDon't MissMahesh Reveals Venkatesh's SecretSuperstar Mahesh Babu and senior star, Victory Venkatesh bonded well when they did 'Seethamma Vaakitlo...
Mirchi9