Ambati-Rayudu---IPLప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 11లో తెలుగు తేజం అంబటి రాయుడు దుమ్ము దులుపుతున్నాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ తరపున అద్భుతంగా ఆడిన రాయుడు, ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న రాయుడుకు బీసీసీఐ మరో అవకాశం కల్పించింది.

రాబోయే సీజన్ లో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు అంబటి రాయుడుని ఎంపిక చేయడంతో, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి బీసీసీఐ సెలెక్షన్స్ సజావుగా సాగాయని, ప్రతిభకు గుర్తింపు లభించిందని నెటిజన్లు కూడా కితాబిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే అంతర్జాతీయంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, సరైన అవకాశాలు లభించక, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో రాయుడు విఫలం అయ్యాడు.

దీంతో ఈ సారి వచ్చిన అవకాశం అయినా రాయుడుకి వరంగా మారుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం అంబటి ప్రదర్శిస్తోన్న ఫాంను బట్టి అయితే తుది జట్టులో రాయుడు లేకుండా బరిలోకి దిగడం అసాధ్యం. రాయుడుతో పాటు కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్ లకు రీ ఎంట్రీ లభించగా, కౌల్, వాషింగ్టన్ సుందర్ లు కూడా జట్టు స్క్వాడ్ లో ఎంపిక అయ్యారు.