Ambati-Rambabuరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా నియమితులవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని సరిపెట్టుకొంటున్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఆయనకి తెలిసిన ఏకైక విషయం డయాఫ్రాం వాల్వ్. అది కాస్త దెబ్బ తినడంతో ఇక ఆయనకి పనిలేకుండా పోయిందనే చెప్పాలి. అందుకే పోలవరం గురించి విలేఖరులు ప్రశ్నిస్తే ‘పవన్‌ కళ్యాణ్‌ నాలుగో పెళ్ళి చేసుకొనేలోగా నిర్మిస్తామంటూ’ పొంతనలేని సమాధానాలతో తప్పించుకొంటుంటారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి వెళ్లినప్పుడు పోలీసులు ఆయనని అడ్డుకొని వెనక్కు తిప్పి పంపేశారు. “పోలవరంలో దాచి పెట్టడానికి ఏముంది? నన్ను ఎందుకు అడ్డుకొంటున్నారు?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నకు సమాధానం లేదు.

సాగునీటిశాఖకి సంబందించి శాసనసభలో అడిగే ప్రశ్నలకు మంత్రి అంబటి రాంబాబు సమాధానాలు చెప్పలేక తడబడతారేమో కానీ చంద్రబాబు నాయుడుకి చెప్పడానికి కాదు. అందుకే ఆయన ఎంట్రీ ఇస్తూ, “పోలవరం ప్రాజెక్టు ఏమీ రాజకీయ వేదిక కాదు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి హడావుడి చేయడానికి. ఆయనని నేను మూడు ప్రశ్నలు అడుగుతాను. సమాధానం చెప్పగలరా? అని సవాలు విసిరారు.

1. కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తానంటే దానిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొన్నారు. 2. పోలవరం ప్రాజెక్టులో నీళ్లు పారించకపోతే ప్రజలని ఓట్లు అడగనని శపదం చేసిన చంద్రబాబు నాయుడు. కానీ ఎన్నికలకి ఎందుకు వెళ్ళారు?3. ముందు కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రాం వాల్వ్ నిర్మించడం చారిత్రిక తప్పిదం అని అంగీకరిస్తారా లేదా?

ఆనాడు పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా శ్రద్ధ చూపుతూ ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించడం అందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయించలేక చేతులెత్తేసింది. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని మంత్రి అంబటి రాంబాబు మూడేళ్ళ క్రితమే చెప్పేశారు. ప్రాజెక్టు పూర్తిచేయలేని వ్యక్తి దాని కోసం తపించిన చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.

గత ఎన్నికలలో వైసీపీ గెలిస్తే అమరావతి పనులను కొనసాగిస్తుందని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం, దానిని పక్కన పడేసి మూడు రాజధానులు పాట ఎత్తుకొంది. కానీ వాటినీ ఏర్పాటు చేయలేకపోయింది! పోలవరం పూర్తి చేస్తామని చెప్పి చేతులు ఎత్తేసింది. అయినా మళ్ళీ ఎన్నికలలో వైసీపీనే గెలిపించాలనికోరుకొంటోంది. అదీ… 175 సీట్లతో! ఏ పనీ చేయకుండానే వైసీపీ ఎన్నికలకి వెళున్నప్పుడు, పోలవరంలో 70 శాతం పనులు చేయించిన టిడిపి ఎందుకు వెళ్ళకూడదు?

కాఫర్ డ్యాం కట్టకపోవడం వలననే డయాఫ్రామ్ వాల్వ్ దెబ్బ తిందని మూడేళ్ళుగా టిడిపిని నిందించేబదులు, ఈ మూడేళ్ళలో దానిని తిరిగి ఎందుకు నిర్మించలేదు?అనే ప్రశ్నకు అంబటి రాంబాబే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.