Ambati Rambabuఎక్కడైనా లక్కీ డ్రా తీస్తే బైకులో కార్లో లేదా వెండిబంగారు ఆభరణాలో ఇస్తారు. కానీ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు అధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి లక్కీ డ్రా తీస్తే హైకోర్టు కేసు వచ్చింది! లక్కీడ్రాలో హైకోర్టు కేసు రావడం ఏమనుకొంటున్నారా? అయితే సత్తెనపల్లి వెళ్ళాల్సిందే.

మంత్రి అంబటి రాంబాబు తన సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. దాని కోసం ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని జనసేన నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ మంత్రిగారి సొంత నియోజకవర్గంలో ఆయనపై కేసు నమోదు చేయగల ధైర్యం ఎవరికుటుంది?అందుకే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దాంతో జనసేన నేతలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా సత్తెనపల్లి పోలీసులని ఆదేశించింది. హైకోర్టు ఆదేశించడంతో మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ సత్తెనపల్లి లక్కీ డ్రా కధ!

అయితే ప్రతిపక్ష నేతలకి ఎడాపెడా నోటీసులు జారీ చేసి విచారణకి రమ్మనమని పిలిచే పోలీసులు, ఈ కేసు దర్యాప్తుని ఏవిదంగా చేస్తారో చూడాలి.