Ambati-Rambabu-Devineni-Umamaheswara-Raoఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి మాజీ మంత్రి దేవినేని ఉమా ఊహించని షాక్ ఇచ్చారు. ఈరోజు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కార్యాలయానికి వెళ్ళి మంత్రిపై ఫిర్యాదు చేశారు. మంత్రి అంబటి రాంబాబు తన పేరిట ఫేక్ ట్వీట్స్ సృష్టించి తనకు వ్యక్తిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఒక మంత్రి హోదాలో ఉన్న ఆయనే ఇటువంటి నీచమైన పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.

ఆ తరువాత అక్కడి నుంచి నేరుగా ఏపీ సీఐడీ పోలీస్ కార్యాలయానికి వెళ్ళి మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. మంత్రి అంబటి ఉద్దేశ్యపూర్వకంగానే తన పేరిట నకిలీ ట్వీట్స్ సృష్టించి సోషల్ మీడియాలో పెడుతున్నారని దేవినేని ఉమా ఫిర్యాదు చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నలలోనే అంబటి రాంబాబు ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

తన పేరిట నకిలీ ట్వీట్స్ చేసినందుకు, వాటితో ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్న మంత్రి అంబటి రాంబాబుపై సంబందిత సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి తక్షణం చర్యలు చేప్పట్టాలని దేవినేని ఉమా సిఐడీ పోలీసులను కోరారు. మంత్రి అంబటిని విచారించే దమ్ము, ధైర్యం ఏపీ సీఐడీ పోలీసులకు ఉన్నాయా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఒకవేళ వారు స్పందించకుంటే హైకోర్టుని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.

అంతకు ముందు తన పేరిట అంబటి సృష్టించిన నకిలీ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ, “ఈ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన మాట వాస్తవమా, కాదా? ధైర్యముంటే చెప్పు అని నిలదీశారు.