Ambati Rambabuటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు మాజీ స్పీకర్‌, టిడిపి దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో చేశారని అటువంటి గొప్ప నాయకుడిని జగన్ ప్రభుత్వం వెంటాడి వేదించి ఆత్మహత్య చేసుకొనేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు ఆరోపణలపై సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు వెంటనే స్పందించారు. అయితే కోడెలపై తమ ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందని, విచారణ జరిపించిందని అది తప్పా…. ఆవేమైనా రాజకీయ వేధింపులా?ఆ కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకొన్నారని చంద్రబాబు నాయుడు వాదించడం సరికాదన్నారు. కోడెలను తమ ప్రభుత్వం వెంటాడి కేసులతో వేదిస్తుంటే చంద్రబాబు నాయుడు ఆయనకు అండగా నిలబడకపోవడం వలననే ఆత్మహత్య చేసుకొన్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. కనుక చంద్రబాబు నాయుడు వలననే ఆయన ఆత్మహత్య చేసుకొన్నారని దీనికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని అంబటి రాంబాబు తనదైన శైలిలో గట్టిగా నొక్కి చెప్పారు.

ఓ పక్క కోడెలపై తమ ప్రభుత్వం కేసులు పెట్టి వేదిస్తోందని చెప్పుకొంటూనే అందుకు ఆయన ఆత్మహత్య చేసుకోలేదు చంద్రబాబు నాయుడు పలకరించకపోవడం వలననే నిరాశనిస్పృహలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారని మంత్రి అంబటి రాంబాబు వితండవాదం చేస్తే చేశారు కానీ వేధింపులు భరించలేకనే ఆయన ఆత్మహత్య చేసుకొన్నారనే విషయం స్వయంగా ధృవీకరించారు కదా?ఆ సమయంలో కోడెలకు టిడిపిలో అందరూ అండగా నిలబడినప్పటికీ, ప్రజలలో ఎంతో గౌరవంగా బ్రతికిన ఆయన జగన్ ప్రభుత్వం చేస్తున్న ఈ అవమానాలు, వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకొన్నారనేది సత్తెన్నపల్లి ప్రజలందరికీ తెలుసు. అదే అంబటి రాంబాబు గొంతు చించుకొని చెపుతున్నారు కూడా!