దొంగతనం చేసిన క్రిమినల్స్ ను పోలీసులు పట్టుకుని శిక్షించాలని అందరూ అనుకుంటారు. కానీ “మనీ హేస్ట్” చూసిన ప్రేక్షకులు మాత్రం ఆ క్రిమినల్స్ ఎలా తప్పించుకుంటారు? పోలీసులకు దొరక్కుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అది “మనీ హేస్ట్” వెబ్ సిరీస్ స్పెషల్.

దొంగతనం ఎలా చేయాలి? చేసిన తర్వాత ఉత్పన్నమయ్యే పర్యవసానాలు ఏంటి? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పట్టుబడితే ఎలా హింసలు పెడతారు? ఇలా అన్ని కోణాలలో ప్రొఫెసర్ శిక్షణ ఇచ్చి మరీ డబ్బు, బంగారం కొట్టేయడానికి ప్లాన్స్ వేసి సక్సెస్ అవుతారు.

ఇలాంటి పాత్రలోనే “దృశ్యం 2” సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కనిపించారు. ఐజి కొడుకును అంతమొందించిన తర్వాత పోలీసులు రాంబాబును పట్టుకోవడానికి వేసే ఎత్తుగడలన్నీ ముందు పసిగట్టి, వాటికి కౌంటర్ వేస్తూ పోలీసులకు చిక్కకుండా చూపించిన విధానం “మనీ హేస్ట్”ను పోలీ ఉంటుంది.

ఆ వెబ్ సిరీస్ చూస్తూ ఎలా అయితే క్రిమినల్స్ తప్పించుకోవాలని ప్రేక్షకులు భావిస్తారో, ఈ సినిమాలో కూడా నేరం చేసిన వెంకీ పట్టుబడకుండా ఉండాలని వీక్షకులు కోరుకుంటారు. రెండున్నర్ర గంటల ‘దృశ్యం 2’ క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది. ఇక మిగిలింది ‘మనీ హేస్ట్’ క్లైమాక్సే! డిసెంబర్ 3వ తేదీన ఈ వెబ్ సిరీస్ ఫైనల్ పార్ట్ విడుదల కానుంది.