amazon-prime-video-bought-the-sye-raa-narasimha-reddy-digital-rightsమెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజగా సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందట. అన్ని భాషలలో సినిమా రైట్స్ కోసం ఆ సంస్థ నిర్మాతకు 40 కోట్లు చెల్లించిందట.

పైగా రిలీజ్ తరువాత 50 రోజుల వరకూ సినిమాను ప్రైమ్ లో విడుదల చెయ్యకూడదని అగ్రిమెంట్ చేశారట. దీనితో రెండు విధాలుగానూ నిర్మాతలకు కలిసి వచ్చేదే. అమెజాన్ వల్ల సినిమా థియేట్రికల్ రన్ కు ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 2న విడుదల అంటే 1న అమెరికా లో ప్రీమియర్లు ఉంటాయి. అక్టోబర్ 1 మంగళవారం కావడంతో అమెరికాలో సహజంగా ఉండే ఆఫర్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖైదీ నెం 150 ప్రీమియర్లేకే వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ రాబట్టింది. సైరా కు అదే టార్గెట్ కాబోతుంది.

ఇక ఈ సినిమాతో హిందీ లో కూడా తడాఖా చూపించాలని చిరంజీవి ఆసక్తిగా ఉన్నారట. అమిత్ తడాని, ఫర్హాన్ అక్తర్ ఈ సినిమా హిందీ రైట్స్ ను చేజిక్కించున్నారు. ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని మార్కెట్ చెయ్యబోతున్నారు. గతంలో వీరిద్దరూ కేజిఫ్ ను హిందీలో ఇలాగే విడుదల చేశారు. దీనితో సినిమాకు అక్కడ మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది. సాహూ టాక్ బాగా లేకపోయినా హిందీలో బాగా వసూళ్లు రాబట్టింది. దీనితో సైరా ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో… చిరంజీవి కల నెరవేరుతుందో లేదో చూడాలి.