మూడు ప్రధాన చిత్రాలు – పొన్మగల్ వంధల్, గులాబో సీతాబో, మరియు తాజాగా పెంగ్విన్ సినిమాలు తమ థియేట్రికల్ విడుదలను దాటవేసి నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి. ఈ మూడు చిత్రాలను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేశారు. కానీ పాపం, ఒక్క సినిమా కూడా మంచి సంచలనం పొందలేదు.

ఈ మూడు సినిమాల వాళ్ళ అమెజాన్‌కు భారీ నష్టం తప్పేలా లేదు. ఈ చిత్రాల హక్కుల కోసం మరియు మార్కెటింగ్ చేయడానికి ఈ డిజిటల్ జెయింట్ భారీ డబ్బును పెట్టుబడి పెట్టింది. ఈ వరుస పరాజయాలు సినిమా ఇండస్ట్రీ వారిని కూడా కలవరపెడుతుంది. “సినిమాలు ఓటీటీలకు లాభం చేకూరుస్తేనే, ఓటీటీ దిగ్గజాలు భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ఫాన్సీ ఒప్పందాలతో ముందుకు వస్తాయి” అని వారు చెప్పారు.

ఈ రకమైన వైఫల్యాలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు సినిమాలు కొనడం గురించి ఆందోళన చెందుతాయని మరియు వారు కొనుగోలు చేసినా, వారు పెద్ద మొత్తాలు ఇవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇప్పటికే కోవిడ్ సంక్షోభంతో బాధపడుతున్న చిత్ర నిర్మాతలకు ఇది భారీ దెబ్బ అవుతుంది.

మరోవైపు కొందరు ఏకంగా నిర్మాతలు తెలివిగా సినిమా థియేటర్లలో ఆడవు అనుకున్న సినిమాలనే ఓటీటీలకు అమ్మేస్తున్నారు అంటున్నారు. తమ సినిమాల మీద నమ్మకం ఉన్న వారు మాత్రం థియేటర్లు ఓపెన్ అయ్యే వరకూ వెచ్చి చూస్తారు అని అంచనా వేస్తున్నారు.