amaravati NRT Icon Building inaugurationఏపీ రాజధాని అమరావతిలో ప్రవాసాంధ్రుల కోసం ఉద్దేశించి నిర్మించ తలపెట్టిన ఎన్ఆర్‌టీ ‘ఐకాన్ టవర్‌’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించనున్నారు. రాజధానిలోని పరిపాలన నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. 400 కోట్ల అంచనా వ్యయంతో 36 అంతస్తుల్లో ఏపీఎన్ఆర్‌టీ దీనిని నిర్మించనుంది. అమరావతి ఇంగ్లీష్ అక్షరాల్లోని ‘ఎ’ తరహాలో ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్ ఆకృతిని రూపొందించారు.

కొరియాకు చెందిన స్పేస్‌ కార్పొరేషన్‌ సంస్థ ఈ ఆకృతిని రూపొందించింది. భవనం అంతస్తుల మధ్య పిల్లర్లు లేకుండా నిర్మిస్తుండడంతో మామాలు కంటే స్థలం కలిసొస్తుందని అధికారులు తెలిపారు. అమరావతికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈ టవర్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఉదయం పది గంటలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన అనంతరం తర్వాత బహిరంగ సభలో మాట్లాడతారు.