Amaravati - Mandaddam tent collapsedనవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ 323 రోజులుగా రైతులు, కూలీలు, మహిళలు దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. అయితే ఇప్పటివరకు రైతులకు సంఘీభావం కూడా తెలపని అధికార పక్షం వీరి దీక్షలకు పోటీగా మూడు రాజధానులను సమర్థిస్తూ ఏపీవ్యాప్తంగా 30 లక్షల మందికి సెంటు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతూ పోటీ శిబిరాలను ఏర్పాటు చేశారు.

రాజధాని ప్రాంతంలోనే అమరావతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయిస్తే అసలు విషయం పల్చబడుతుందని… అధికార పక్షం వారే డబ్బులిచ్చి మరీ మనుషులను తరలిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే మందడం సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఆ శిబిరం టెంట్ నిన్న సాయంత్రం కురిసిన గాలి, వానకు కుప్పకూలిపోయింది.

కూలిపోయే ముందే చాలా సేపటి ముందువరకూ వర్షం పడటంతో శిబిరానికి ఎవరు రాలేదు… ఒకవేళ మనుషులు ఉన్నప్పుడు ప్రమాదం జరిగి ఉంటే గాయాలపాలయ్యేవారని అంటున్నారు. దానితో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అంటున్నారు.

అమరావతి తరలింపు, మూడు రాజధానుల నిర్ణయం ప్రకృతికి నచ్చడంలేదని, అదే సంకేతంగా తీసుకుని ప్రభుత్వం ఈ విషయం పై వెనక్కు తగ్గాలని రాజధాని రైతులు అంటున్నారు. రాజధాని తరలింపు విషయం కోర్టులలో పెండింగ్ లో ఉంది. అవి క్లియర్ అయితే సంక్రాంతి కల్లా విశాఖపట్నం నుండి పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి ఆలోచనగా ఉంది.