Physical Attacks Wrong But It is A culminated Reaction For Agonizing Farmersఒక టీవీ ఛానల్ లైవ్ డిబేట్ లో అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాసరావు బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు తో దాడి చెయ్యడం సంచలనం సృష్టించింది. అమరావతి రైతులను పదే పదే విష్ణువర్ధన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులని పిలవడంతో శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. అయితే దీనిపై ఏపీలో టీడీపీ తప్ప మిగతా పార్టీలు ఏకం కావడం గమనార్హం.

బీజేపీ విష్ణు కు మద్దత్తు ఇవ్వడం మాములే. పొత్తు కారణంగా జనసేన సపోర్ట్ కూడా మాములే. అయితే అమరావతి అంటే మామూలుగానే ద్వేషం కాబట్టి అందులోనూ ఆంధ్రజ్యోతి లో జరిగిన డిబేట్ కాబట్టి వైయస్సార్ కాంగ్రెస్ కూడా విష్ణు మీద ఎక్కడ లేని సానుభూతి చూపిస్తుంది. శ్రీనివాస రావు టీడీపీ నాయకుడని కూడా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అయితే అతను ఏకంగా టీడీపీ మీడియా ప్రతినిధి అంటూ ప్రచారం చేస్తున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల మీద భౌతిక దాడులు ఎవరు చేసినా ఖండించాల్సిందే. అయితే విష్ణు బాధితుడిగా… శ్రీనివాసరావు ను దోషిగా చూపడం కూడా పూర్తిగా న్యాయం కాదు. నెలల తరబడి అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ దారుణమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. పై పెచ్చు విష్ణు కూడా అమరావతి లో మహిళలను కూడా మాటలు అన్నవారే.

నిన్న జరిగిన డిబేట్ లో కూడా విష్ణు అంటువంటి లూజ్ మాటలు మాట్లాడి పరిస్థితి అక్కడి వరకూ తెచ్చుకున్నారు. జరిగిన దానిని సమర్దించలేం..అయితే కేవలం ఇందులో విష్ణుని బాధితుడిగా… శ్రీనివాసరావు ను దోషిగా చూపడం కూడా పూర్తిగా న్యాయం కాదు. మంత్రుల దగ్గర నుండి పార్టీల కార్యకర్తల వరకు అంతా ప్రభుత్వానికి భూమిలిచ్చి నష్టపోయిన రైతులను మాటలు అన్న నాడు అంతా ఖండించి ఉంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేది కాదు.