amaravati farmers padayatraవైసీపీ అధినేత జగన్ ఉన్నట్లుండి తన మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడానికి గల కారణాలపై పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. ‘హైకోర్టు తీర్పు వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా వస్తుందన్న భయంతోనే ముందుగా తానే బిల్లును వెనక్కి తీసుకున్నారనేది’ ప్రధానంగా వినపడుతోన్న అంశం.

అయితే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే ఇంటిలిజెన్స్ వర్గాలు ఇటీవల అమరావతి రైతులు ప్రారంభించిన ‘పాదయాత్ర’పై కూడా సమాచారాన్ని ఇచ్చారని, ఈ ‘పాదయాత్ర’కు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తోందన్న ఇన్ఫర్మేషన్ ను ఐబీ ఇచ్చినట్లుగా ప్రముఖ దినపత్రిక నేడు ఓ కధనాన్ని ప్రచురించింది.

అమరావతి ఉద్యమం ఇప్పటివరకు గుంటూరు, కృష్ణా జిల్లాలకు మాత్రమే పరిమితం కాగా, ఈ పాదయాత్ర ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు కూడా పాకుతుందని, అదే జరిగితే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెచ్చు మీరుతుందన్న భయంతోనే ముందస్తు చర్యలుగా బిల్లును వెనక్కి తీసుకున్నారనేది మరో కారణం.

‘పాదయాత్ర’ ద్వారా ప్రభుత్వాలు మార్చేసే చరిత్ర కలిగిన రాష్ట్రం ఏపీ. 2014లో చంద్రబాబు, అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2019లో జగన్ మోహన్ రెడ్డి… ఇలా పాదయాత్రలు చేసి రాష్ట్ర పగ్గాలను చేపట్టిన వారే. బహుశా ‘పాదయాత్ర’కున్న పవర్ జగన్ కు తెలిసినంతగా, మరొకరికి తెలియకపోవచ్చు.

ఆ ‘పాదయాత్ర’ను వెనువెంటనే నియంత్రించే చర్యలలో భాగమే ప్రస్తుతం ఏపీలో జరుగుతోన్న రాజకీయంగా పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.