amaravati farmers bans chiranjeevi moviesఅమరావతిని నిర్వీర్యం చేస్తూ మూడు రాజధానుల ప్రతిపాదనను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకు తెచ్చిన నాటి నుండీ రాజధానికి భూములిచ్చిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేసిన నాటి నుండీ రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు

ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవిపై కూడా రైతులు భగ్గుమంటున్నారు. “పవన్ కళ్యాణ్ మాకు సపోర్ట్ చేయడం సంతోషంగా ఉంది. కానీ చిరంజీవి ఇలా స్వాగతిస్తున్నట్లు ప్రకటించడం పద్ధతి కాదు. చిరు ఏ రోజూ ప్రజా సమస్యల మీద మాట్లాడింది లేదు.. పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మూడు రాజధానులను ఎలా సమర్థిస్తారు?,” అని వారు ప్రశ్నిస్తున్నారు.

మీ సినిమాలు చూడటానికి.. ఆడించుకోవటానికి జగన్‌గారిని కలిశారు కానీ.. ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. అసలు మీరు ఆంధ్రాలో ఉంటున్నారో..? వైజాగ్‌లో ఉంటున్నారో..? హైదరాబాద్‌లో ఉంటున్నారో..? జనాలకు తెలియని పరిస్థితి. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే అమరావతిలో చిరంజీవి సినిమాలు విడుదల కాకుండా అడ్డుకుంటాం,” తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు

ఇది ఇలా ఉండగా చిరంజీవిపై మెగా అభిమానులు కూడా నిట్టనిలువునా చీలిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి జనసేనకు నష్టం చేసే ఇటువంటి ప్రెస్ నోటు ఎందుకు విడుదల చెయ్యాల్సి వచ్చింది,” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం చిరంజీవికి సొంత అభిప్రాయాలు ఉండకూడదు అని సమర్థిస్తున్నారు.