Amaravati Farmers Become A Example of Farmers Across the Countryవైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెలలో అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చెయ్యడంతో అమరావతి రైతులు రోడెక్కారు. ఆ రోజు నుండి ఈరోజు వరకూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. 16 రోజుల పాటు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో నేటి నుండి సకల జనుల సమ్మెకు దిగారు రైతులు.

అయితే ఇప్పటిదాకా చేసింది చాలు అనుకున్నారో ఏమో ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే పనిలో పడింది. అమరావతిలోని వెలగపూడి, మల్కాపురం గ్రామాల రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. 307 హత్యాయత్నంతో పాటు మరో 7సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆధార్ కార్డుతో రావాలని 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి.

మరోవైపు మందడం గ్రామంలో ఏకంగా పోలీసులు రెచ్చిపోయారు. ధర్నా చేస్తున్న మహిళల్ని సైతం వదలకుండా పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చెయ్యడంతో పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ. జరిగింది. చాలా మంది మహిళలని బస్సులోకి తోసుకుంటూ కుక్కేప్రయత్నం చేసారు.

పోలీసు వాహనానికి అడ్డుగా పడుకున్న రైతులపై బస్సు ఎక్కించడానికి కూడా వెనుకాడకపోవడంతో పోలీసు వాహనం టైరు చేయి ఎక్కడంతో ఒక రైతుకు గాయాలు గాయాలు అయ్యాయి. వ్యాను ఎక్కించే క్రమంలో పలువురు మహిళల గొంతు నులిమారని కొందరు ఆరోపించారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు వారిని వదిలిపెట్టారు.