amaravati Bonds in BSEఅమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన బాండ్లకు బోంబే స్టాక్‌ ఎక్చ్సేంజీ లో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈరోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో అమరావతి బాండ్లను అమ్మకానికి ఉంచింది. 1300 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా రూ.10లక్షల ముఖ విలువతో 600 బాండ్లను స్టాక్‌మార్కెట్‌లో ఉంచింది.

అయితే ట్రేడింగ్‌ ప్రారంభం కాగానే ఈ బాండ్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఒక్కో బాండ్‌ ఏకంగా 1.5రెట్ల అధిక ధరకు అమ్ముడుపోయింది. దీంతో ఊహించిన దానికంటే భారీగా ఏకంగా రూ.2వేల కోట్లకు పైగా నిధులు రాబట్టింది. మున్సిపల్‌ బాండ్ల కేటగిరీలో ఇంత భారీ మొత్తంలో సబ్‌స్ర్కైబ్‌ కావడం దేశంలో ఇదే తొలిసారని సమాచారం.

రాబోయే రోజుల్లో మరిన్ని రిటైల్‌ బాండ్లను కూడా ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. రాజధాని నిర్మాణానికి బాండ్ల ద్వారా 10వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడతలోనే 2000 కోట్లు సేకరించి రికార్డు సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం.