Amar Akbar Anthony Theatrical Trailerశ్రీనువైట్ల – రవితేజల కాంభినేషన్ అంటే… సినీ ప్రేక్షకులకు పండగే. ఎటకారపు డైలాగ్స్… ఫన్నీ సన్నివేశాలు… పుష్కలంగా ఉండడం గత మూడు సినిమాలలో చవిచూశారు. దీంతో సాధారణంగా నాలుగవ సినిమాకు కూడా అదే తరహాను ప్రేక్షకులు ఆశించడం పరిపాటి. కానీ అందుకు విరుద్ధంగా శ్రీను – రవి ప్రయత్నించినట్లుగా “అమర్ అక్బర్ అంటోనీ” ట్రైలర్ చెప్తోంది.

వీరిద్దరి కాంబో ఫ్లో వచ్చే రియల్ ఫన్నీ ఎలిమెంట్స్ ట్రైలర్ లో మిస్ కావడం ప్రేక్షకులకు నిరాశ కలిగించే అంశం. బహుశా సిట్యూయేషనల్ కామెడీ అయితే సిల్వర్ స్క్రీన్ పై పండే అవకాశం ఉంది. టీజర్ తో ఆసక్తికరంగా మొదలైన ప్రమోషన్, ట్రైలర్ కు వచ్చేపాటికి తగ్గిపోవడం గతంలో శ్రీను వైట్ల ‘మిస్టర్’ సినిమా మాదిరే జరుగుతోంది.

ఇక కధ పరంగా కూడా కొత్తదనం లేకపోవడం, అమర్, అక్బర్, అంటోనీ అనే క్యారెక్టర్లు శ్రీను వైట్ల సహజంగా మార్చే గెటప్ లేనని ట్రైలర్ లో చూపించడం… రొటీన్ గా మారిపోయింది. అయితే రెండున్నర్ర గంటల నిడివి గల సినిమాలో మరింత ఆకట్టుకునే విధంగా ఉంటుందేమో తెలియాలంటే, ఈ నెల 16వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం కూడా పేలవంగా ఉందన్న టాక్ ను సొంతం చేసుకుంది.