Amar- Akbar Anthony -Talkశ్రీను వైట్ల గత చిత్రాల ట్రాక్ రికార్డ్ ను అధిగమించే విధంగా “అమర్ అక్బర్ అంటోనీ” సినిమా ఫస్ట్ టాక్ వెలువడిందా? అంటే మరోసారి వైట్లకు చేదు అనుభవం ఎదురవబోతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ, ఇలియానాలు జంటగా నటించిన ఈ సినిమా రొటీన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది, అది కూడా ఆకట్టుకొని రీతిలో..!

ముఖ్యంగా శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఈ సినిమాలో లోపించగా, బలవంతపు కామెడీ సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ అవుట్ డేటెడ్ కామెడీ మాస్ వర్గాలను అయినా మెప్పిస్తుందో లేదో చూడాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాలి. రవితేజ తన సహజసిద్ధ శైలిలో రొటీన్ గా కనిపించగా, ఉన్నంతలో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందనిపిస్తుంది.

యుఎస్ లో చిత్రీకరించబడిన ఈ సినిమాలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ విలువలు ప్రతి షాట్ లోనూ కనిపిస్తాయి. ఈ సినిమాతో రీ బ్యాక్ అయిన సునీల్ ‘ఓకే’ అనిపించుకోగా, శ్రీనువైట్ల తదుపరి సినిమా ఏ హీరోతో? ఎప్పుడు? అన్న ప్రశ్న మాత్రం సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులకు కలగడం సహజం.