Amala-Paul's-Aadai-Teaser-Talk-Shockingly-Bold-&-Wrenchingతెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అమలాపాల్. ఆమె నటించిన కొత్త తమిళ చిత్రం ‘ఆడై’. రత్నకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. టీజర్ మొత్తం ఒక సస్పెన్స్ వాతావరణం నెలవుకోని ఉండగా ఆఖరులో అమలాపాల్ ఇంట్రో అయితే అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆ షాట్లో అమలాపాల్ బోల్డ్‌గా నటించేసింది. పూర్తి వివస్త్రగా నటించింది అందరినీ షాక్ కు గురిచేసింది. ఇలా నటించడానికి అమల పాల్ చేసిన సాహసాన్ని అందరూ పొగుడుతున్నారు.

తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. తమిళ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా ఉంది. అయితే ఈ సీన్లు తీయడానికి అమల పాల్ చాలా కష్ట పడిందట. దాదాపుగా 20 రోజుల పాటు నగ్నంగా ఉండి ఈ సీన్లు షూట్ చేశారట. అయితే సెన్సార్ బోర్డు మాత్రం వీటిని ఒప్పుకోలేదట. సినిమా నుండి ఈ సీన్లను తీసివెయ్యడమో లేక పూర్తిగా బ్లర్ చెయ్యడమో చెయ్యాలని ఆదేశించిందట. దీనితో ఆ సీన్లను బ్లర్ చేసిందట చిత్ర బృందం.

మరోవైపు ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు టీజర్ కూడా విడుదల చేశారు. తొందరలోనే ఈ సినిమా ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. తెలుగులో కూడా ఈ సినిమా పై బయర్లలో మంచి క్రేజ్ వచ్చింది. తెలుగు బిజినెస్ కూడా క్లోజ్ అయితే విడుదల తేదీని ప్రకటించాలని యోచిస్తోంది చిత్ర బృందం. తొందరలో అమల పాల్ హైదరాబాద్ వచ్చి సినిమా ప్రొమోషనలు మొదలు పెడుతుంది.