Amala  paul no for Second Marriageతెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, ఆ తరువాత దర్శకుడిని వివాహం చేసుకోవడం, అతని నుండి విడాకులు తీసుకోవడం… తదితర సంగతులు తెలిసినవే. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రెండవ పెళ్లిని గురించిన ప్రశ్న ఎదురైంది.

“ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా నా కెరియర్ పైనే వుంది. ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. మొదటిసారి వివాహం నా నిర్ణయం వలన జరిగింది. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. అందువలన ఈ సారి నా పెళ్లి నిర్ణయాన్ని మా అమ్మానాన్నలకే వదిలేశాను. వాళ్లు నా మంచినే కోరుకుంటారు గనుక, ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లనే చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది. తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఈ సందర్భంగా అమలా పేర్కొనడం కొసమెరుపు.