amala-paul-divorce-celebrity-badminton-leagueదర్శకుడు విజయ్ తో జరిగిన పెళ్లి మున్నాళ్ళ ముచ్చట కావడంతో… ప్రస్తుతం మళ్ళీ హాట్ హాట్ హల్చల్ చేస్తోంది హీరోయిన్ అమలాపాల్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హానీమూన్ విశేషాలు కూడా పంచుకున్న ఈ ముద్దుగుమ్మ స్వేచ్చా జీవితానికి పెళ్లి తర్వాత బ్రేకులు పడడంతో, ఆ లైఫ్ తన వల్ల కాదంటూ కుండబద్దలు కొట్టి, మళ్ళీ వెండితెరపై వెలిగిపోవాలన్న ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా “సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్”లో పాల్గొన్న అమలాపాల్, కురచ నిక్కర్లతో దర్శనమిచ్చి అందరినీ అవాక్కు చేసింది. తను నటించిన సినిమాలలో కూడా ఈ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేయలేదేమో అనేటంత కాస్ట్యూమ్స్ తో వీక్షకులకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వీటిని సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెళ్లికి ముందు, దాంపత్య జీవితం, ప్రస్తుతం సోలోగా… మూడు వైవిధ్యమైన జీవితాలను అమలాపాల్ చవిచూసింది. అయితే అంతకుముందు ఎపుడూ లేనంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రస్తుతం ఉన్నట్లుగా కనపడుతోంది.