ఏరకంగా చూసినా అల్లు అర్జున్ కు అదే మంచిదిస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో మరియు తమిళనాడులోని తెన్కాసిలో మూడు కీలకమైన షెడ్యూల్లను పూర్తి చేసింది. ఈ చిత్రం ఆగస్టు 13 న స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు. అయితే సినిమా షూటింగ్ ఊహించిన విధంగా సాగడం లేదని, ఆగస్టు 13 వరకు సినిమా రెడీ కాకపోవచ్చని సమాచారం.

అయితే ఒకరకంగా అల్లు అర్జున్ కు అదే సరైన నిర్ణయం అవ్వొచ్చు. సినిమా మేకింగ్ లో కంప్రమైస్ అయ్యి రెడీ చెయ్యాల్సినంత డేట్ ఏమి కాదు ఆగస్టు 13. అలాగే పాన్-ఇండియా స్థాయిలో ఆగష్టు 13కు చాలా పోటీ ఉంటుంది. బాలీవుడ్ లో ఇప్పటికే రెండు సినిమాలు ఆ వారాంతంలో విడుదల అవుతున్నట్టు ప్రకటించాయి.

తమిళంలో అజిత్ వాలిమై కూడా ఆగష్టు 12న విడుదల కానుంది. దానిప్రకారం డేట్ మారడమే మంచిది. చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాతే కొత్త విడుదల తేదీపై తుది కాల్ తీసుకోబడుతుంది. ఒకవేళ రాజమౌళి ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 నుండి వాయిదా పడితే అది కూడా మంచి డేట్ కావొచ్చు పుష్ప విడుదలకు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం 180 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిందని, ఇది బన్నీ కెరీర్‌లో అత్యంత ఖరీదైనదిగా మారుతుందని పుకార్లు ఉన్నాయి.