Allu Sirish, Allu Sirish Shocked Live Show, Allu Sirish Shocked Live Tv Show, Allu Sirish Insulted Live Tv Show, Allu Sirish Insulted Live Television Show టీవీలలో సినిమా కార్యక్రమాలంటే ‘పొగడ్తల డబ్బాలే’ ఎక్కువ. అయితే ఇది ఒకప్పుడు. మారిన కాలానికి అనుగుణంగా తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంలో ప్రస్తుతం ప్రేక్షకులు ముందు వరుసలో ఉంటున్నారు. ఓ పక్కన సోషల్ మీడియా ద్వారా తమ సమాచారాన్ని పంపుతూ, మరో పక్కన లైవ్ షోలో పాల్గొంటున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను కడిగిపారేయడంలో కూడా ముందుంటున్నారు. ఆ క్రమంలోనే అల్లు శిరీష్ కు తాజాగా చేదు అనుభవం ఎదురయ్యింది.

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా చూసాను, బాగానే ఉంది… అంటూ శుభాకాంక్షలు చెప్పిన ఓ కాలర్, మీ సోదరుడు అల్లు అర్జున్ కు ఓ విషయం చెప్పండి అంటూ కొన్ని సూచనలు చేసారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అంటూ వేరు చేసి చూడడం మానేయండి… ఫ్యాన్స్ మధ్య విభేదాలు తలెత్తకుండా మీ అన్నయ్యకు చెప్పండి… బన్నీ స్పీచ్ కు మేమంతా చాలా హర్ట్ అయ్యాం… ఇక ముందు ‘చెప్పను బ్రదర్’ లాంటి అనవసర కామెంట్స్ చేయవద్దని చెప్పండి… అంటూ సాగుతున్న సలహాలను, సదరు మీడియా సంస్థ కట్ చేసి, అల్లు శిరీష్ కు ఉపశమనం కలిగించింది. ఈ సందర్భంలో… ఎలా చెప్పాలో తెలియక అల్లు శిరీష్ కాస్త తడబడ్డాడు.

ఇక, మరో కాలర్ శిరీష్ గత సినిమాలను పోలుస్తూ వ్యాఖ్యానించి ఇంకాస్త ఇబ్బంది పెట్టాడు. మీ మొదటి సినిమా ‘గౌరవం’ సినిమాలో అసలు మీది ఎక్స్ ప్రెషన్స్ లేని ‘బ్లాంక్ ఫేస్’లా కనపడిందని, ఈ సినిమాతో కాస్త ఇంప్రూవ్ అయ్యారని, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో అక్కడక్కడ మాత్రమే మీది ‘బ్లాంక్ ఫేస్’లా కనపడిందని చెప్తున్న తరుణంలో… మళ్ళీ సదరు మీడియా సంస్థ కాల్ ని కట్ చేసింది. అయితే మునుపటి మాదిరిలా కాకుండా, ఈ సారి శిరీష్ కాస్త హుందాగా వ్యవహరించారు.

బహుశా ఆ కాలర్ వ్యక్తపరిచిన అభిప్రాయంలో నిజముంది భావించాడో ఏమో గానీ… ఎందుకు కట్ చేసారు, ఆయనకు అనిపించిందేదో చెప్తున్నాడుగా, చెప్పనివ్వండి… అవును నిజంగానే ఇంప్రూవ్ అవుతున్నాను… అది నమ్ముతున్నాను అంటూ శిరీష్ మాట్లాడగా, ఈ మధ్యలో దర్శకుడు పరశురాం కల్పించుకుని, మొదటి మ్యాచ్ ఆడే వ్యక్తికి, వందవ మ్యాచ్ ఆడే వ్యక్తి చాలా తేడా ఉంటుందని సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. ప్రశంసల లభిస్తాయని ఆశించి వచ్చే సినీ సెలబ్రిటీలకు ఇలా తమ నిర్మొహమాట వ్యవహారశైలితో షాక్ ఇస్తున్నారు ప్రేక్షకులు.