Allu Sirish Geetha Arts, Allu Sirish Geetha Arts Name, Allu Sirish Geetha Arts Name Secret,  Allu Sirish Reveals Geetha Arts Banner Name Secret‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ అంటే తెలుగు పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ. దాని అధినేత అల్లు అరవింద్ అంటే తిరుగులేని నిర్మాత. ‘మగధీర, హిందీ గజినీ, సరైనోడు, 100 % లవ్’ వంట సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఈ గీతా ఆర్ట్స్ సంస్థకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ సంస్థతో కలిసి పనిచేయాలని ఎందరో స్టార్ హీరోలు, దర్శకులు రెడీగా ఉంటారు. అంతటి గొప్ప పేరున్న ఈ సంస్థ ఎలా ఏర్పడింది, దానికి ఆ పేరు ఎలా వచ్చిందనే రహస్యాల్ని అల్లు శిరీష్ బయటపెట్టాడు.

సినిమాలంటే మక్కువతో ఓ నిర్మాణ సంస్థను నిర్మించాలని భావించిన అరవింద్ ఆ సంస్థకు తనకు ఏంతో స్పూర్తినిచ్చి, జీవితంలో గొప్ప పాఠాలను, సత్యాలను బోధించిన శ్రీకృష్ణ భగవద్గీత పేరునే పెట్టాలని నిర్ణయించుకుని గీతా ఆర్ట్స్ అని నామకరణం చేశాడట. ఈ విషయం తెలియని చాలా మంది అల్లు అరవింద్ భార్య పేరు గీతా అని అందుకే సంస్థకు ఆ పేరు పెట్టారని అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదని, భగవద్గీత ఆధారంగా ఆ పేరు పెట్టారని, తన తల్లి పేరు నిర్మల అని అసలు వాస్తవాన్ని బయటపెట్టాడు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్.