Allu Sirish dances sarrainodu blockbuster songసోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేసే సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ ముందు వరుసలో ఉంటారు. ఎప్పుడూ ఏదొక అంశంతో సందడి చేసే శిరీష్, తాజాగా తన అన్న పాటకు కామెడీ చిందులు వేస్తూ అలరించే ప్రయత్నం చేసాడు. అల్లు అర్జున్ లేటెస్ట్ హిట్ అయిన ‘సరైనోడు’ సినిమాలో సూపర్ హిట్ అయిన ‘బ్లాక్ బస్టరు బ్లాకు బస్టరే…’ పాటకు కొరియోగ్రాఫర్ సాగర్ తో కలిసి కాశ్మీర్ లో కామెడీ స్టెప్పులు వేసి నవ్వించే ప్రయత్నం చేసాడు.

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా షూటింగ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి – శిరీష్ ల మధ్య ఓ యుగళగీతాన్ని కాశ్మీర్ మంచు కొండలలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా షూటింగ్ విరామంలో అభిమానుల కోసం, ఫన్ కోసం ‘బ్లాకు బాస్టర్…’ పాట స్టెప్పులతో ‘వూయ్ లవ్ బన్నీ’ అంటూ తన అన్న మీద ప్రేమను చాటుకున్నాడు. మెగా ఇంట ఇప్పటివరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల నామస్మరణే ఎక్కువగా జరుగగా, ‘సరైనోడు’ విజయం తర్వాత అల్లు అర్జున్ పేరు బాగా వినపడుతుండడంతో, మెగా ఫ్యామిలీలో పరిస్థితులు మారినట్లుగా కనపడుతున్నాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.