Prema Kadhantaయంగ్ హీరో అల్లు శిరీష్, మ‌ల్లూ బ్యూటీ అను ఇమానుయెల్ జంటగా వస్తున్న తాజా చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ పెట్టారు. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్లను ఈరోజు శిరీష్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. అనుకుని పెట్టారో లేక అనుకోకుండా పెట్టారో గానీ ఈ సినిమా కు అన్నీ రెండు రెండుగా కుదిరాయి.

ఫస్ట్ లుక్ కు ముందు సినిమాకు సంబంధించిన రెండు ప్రీ-లుక్ పోస్టర్లు విడుదల చేశారు. అలాగే తొలిసారిగా రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశారు. ఆ ‘రెండు బంధం’ అక్కడితో అయిపోలేదు. ఈ చిత్రానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు. అర్బన్ రిలేషన్షిప్స్ మీద వస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి రెండు నిర్మాణ సంస్థలు. స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా నిలిచే జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, మ‌రో నిర్మాణ సంస్థ శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో క‌లిసి ఈ న్యూఏజ్ ల‌వ్ స్టోరీని నిర్మిస్తున్నారు. చాలా కాలంగా ఒక పెద్ద సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శిరీష్ కు ఇది మంచి అవకాశంగా కనిపిస్తుంది.

సహజంగా జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై వస్తున్న సినిమాలు మినిమం గారంటీ అనే అభిప్రాయం ప్రేక్షకులలో ఉంటుంది. అది సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే చిత్రం ప్రమోషన్లు కూడా ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి. కోవిడ్ పరిస్థితులు చక్కబడగానే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.