allu-family-at-sreeja-weddingమెగాస్టార్‌ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ పెళ్లి వేడుక‌లో అల్లు ఫ్యామిలీ సంద‌డి చేసింది. పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన సంగీత్‌లో అల్లు కుటుంబం సందడి చేసిన‌ట్లు అల్లు శిరీష్ సోషల్ మీడియా మాద్య‌మం ద్వారా తెలిపారు. అల్లు కుటుంబ స‌భ్య‌లంద‌రూ కలిసి దిగిన సెల్ఫీని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు.

‘శ్రీజ సంగీత్‌లో అల్లు ఫ్యామిలీ’ అంటూ ట్వీట్‌ చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజ‌ర‌యినట్లు స‌మాచారం. ఇక‌ రిసెప్షన్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‑లో మార్చి 31న గ్రాండ్ గా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వివాహ విందుకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల‌కు చెందిన‌ ముఖ్యమైన వారిని ఆహ్వానించి గ్రాండ్‌గా నిర్వ‌హించ‌బోతున్నారు.