sukumar allu arjun movie titleతన సినిమాలు వరుసగా విఫలం కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్న మెగా హీరో రామ్ చరణ్, తన తదుపరి సినిమాను క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా, డిసెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. గ్రామీణ వాతావరణ నేపధ్యంలో సాగే ఏమోషనల్ కధగా గతంలో సుకుమార్ ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన సమాచారం ఇచ్చారు. అయితే ఈ సినిమాను నిర్ణయించిన టైటిల్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా, కొత్తదనానికి పరాకాష్టగా ఉండడం విశేషం.

“ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పిఎం” అనే పేరును ఈ సినిమా టైటిల్ గా ఖరారు చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లుగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు. అంతకుముందు “ఫార్ములా ఎక్స్” అని హల్చల్ చేసినప్పటికీ, ఆ టైటిల్ ను ఇప్పటికే చిత్ర యూనిట్ ఖండించడంతో క్లారిటీ వచ్చింది. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన టైటిల్ మాత్రం సరికొత్తగా ఉన్నా, మెగా అభిమానులు ఆహ్వానించే టైటిల్ లా మాత్రం కనపడడం లేదు. అందులోనూ గతంలో సుకుమార్ చెప్పిన గ్రామీణ వాతావరణానికి, ఈ టైటిల్ కు ఎక్కడా మ్యాచ్ కాకపోవడం గమనించదగ్గ విషయం.

మెగా సినిమాల టైటిల్స్ ఎప్పుడూ మాస్ వర్గాలకు రీచ్ అయ్యేలా నిర్ణయిస్తారు. ఇందులో ఏ మాత్రం కాంప్రమైజ్ కారన్న విషయాన్ని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి టైటిల్స్ ను పరిశీలిస్తే ఇట్టే అర్ధమవుతుంది. మరి ప్రస్తుతం హల్చల్ చేస్తోన్న టైటిలే ఫైనల్ అవుతుందో లేక మార్పులు వస్తాయో గానీ, ఈ టైటిల్ మాత్రం జీర్ణించుకోవడం కష్టమే అంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఇటీవల కాలంలో రామ్ చరణ్ లో కూడా మార్పు వచ్చిందని, మాస్ వర్గాలకే పరిమితం కాకుండా అన్ని వర్గాలకు చేరువయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నారని సినీ జనాలు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.