allu arjun sarrainodu`ఆడియో వేడుకలు సినిమాపై ఉన్న అంచనాలను పెంచడానికి ఉపయోగపడాలి గానీ, అప్పటికే ఏర్పడిన అంచనాలను దించడానికి కాదు. బహుశా ఈ విషయం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ యూనిట్ గ్రహించకపోయినా… ‘సరైనోడు’ యూనిట్ మాత్రం బాగానే అర్ధం చేసుకున్నారు. యస్.యస్.థమన్ స్వరపరచిన “సరైనోడు” ఆడియో నేడు మార్కెట్ లోకి నేరుగా విడుదలైంది.

థమన్ బాణీలు విన్న తర్వాత ఆడియో వేడుక ఖర్చులు తగ్గించుకుని ఒక మంచి పని చేసారన్న భావన సంగీత ప్రియులకు, సినీ అభిమానులకు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. సినిమాలో 6 పాటలుంటే మొదటి నుండి అంజలి నర్తించిన ‘బ్లాకు బస్టరే’ పాట ఒక్కటే ప్రచారానికి ఎందుకు వాడుతున్నారో కూడా ఆడియో విడుదలైన తర్వాత స్పష్టమైంది.

అంజలి ఐటెం సాంగ్ తప్ప “సరైనోడు” ఆల్బమ్ లో కనీసం ఒక్కటి కూడా వినసొంపుగా లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. నిజానికి ఇటీవల కాలంలో వస్తున్న చిన్న చిత్రాలకు ఇంత కంటే మంచి పాటలు, ఆహ్లాదకరమైన సంగీతం వినవచ్చు. ఉన్న ఆరు పాటల్లో ఐటెం సాంగ్ మాత్రమే పర్వాలనిపించే విధంగా ఉంది కానీ, అది కూడా మాస్ వర్గీయులకే చేరువయ్యే పాట.

టీజర్లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ సంగీతం విని “సరైనోడు” ఆడియోపై భారీ అంచనాలు పెట్టుకున్న సినీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యే విధంగా ఆల్బమ్ రూపుదిద్దుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా థమన్ స్వరపరిచిన ఆల్బమ్ లో ఒక్క పాట కూడా వినసొంపుగా లేని ఆల్బమ్ ఏదైనా ఉంది అంటే అది “సరైనోడు”కే దక్కుతుందని పాటలు విన్న వారు ఇప్పటికే డిక్లేర్ చేసేసారు. ఈ సమాచారం మెగా అభిమానులకు రుచించకపోయినా వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు కదా…!