అభ్యంతరకర కంటెంట్ కట్!అల్లు అర్జున్ కున్న క్రేజ్ తో ఇటీవల విడుదలైన ‘రాపిడో’ యాడ్ వివాదం తెలిసిందే. ఆర్టీసీ బస్సులను కించపరిచే విధంగా ఉందంటూ ఏకంగా రాపిడో మరియు అల్లు అర్జున్ లకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు వెళ్లడంతో, రాపిడో సంస్థ దిగిరాక తప్పలేదు.

ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల్లా ఉంటాయని, రాపిడో మాదిరి వేగవంతంగా మరియు సురక్షితంగా ఉండవన్న భావన సదరు యాడ్ లో కనిపించడంతో నోటీసులు అందుకుకోవాల్సి వచ్చింది. అయితే ఏదయితే అభ్యంతరక కంటెంట్ ఉందో దానిని వెంటనే తొలగించింది రాపిడో.

అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ యాడ్ పై వివాదం చెలరేగడం బన్నీ ఫ్యాన్స్ కు నిరుత్సాహాన్ని కలిగించింది. తాజా కటింగ్ తో ఆ వివాదం సమసిపోగా, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడాలని స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.