Allu-_Arjun-Pushpaస్టార్ హీరోలు బయట కనిపించడం చాలా అరుదు. అప్పుడప్పుడు ఏదొక సందర్భంలో మాత్రమే కనిపిస్తుంటారు. తమ అభిమాన నటులు ఎప్పుడెప్పుడు కనిపిస్తారో అంటూ ఫ్యాన్స్ అతురతతో ఎదురుచూస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్న స్టార్ హీరోల లిస్టులో అల్లు అర్జున్ ముందున్నాడు. నెల రోజులుగా తరచుగా వార్తల్లోనూ నిలుస్తూనే ఉన్నారు. బన్నీ గెస్ట్ గా వారానికో ఈవెంట్ జరుగుతూనే ఉంది. ఈ మధ్యే వరుడు కావాలెను , పుష్పక విమానం ఈవెంట్స్ లోనూ గెస్టుగా మెరిసారు బన్నీ.

మంగళవారం రాత్రి కూడా ఆహాకు సంబంధించి ఒక ఈవెంట్ కు హాజరయ్యాడు బన్నీ. అయితే ఆయన గెస్టుగా హాజరైన ప్రతి ఈవెంట్లోనూ పుష్ప సినిమా గురించే ప్రస్తావిస్తుండటం కొంత మంది జనాలకు అస్సలు నచ్చడం లేదు. అంతేకాదు ప్రతి ఈవెంట్ లోనూ పుష్ప సినిమా గురించి మాట్లాడటం….మాట్లాడిన ప్రతిసారి తగ్గేదే లేదంటూ డైలాగులు విసురుతూ ఫ్యాన్స్ భారీ ఆశలు కల్పిస్తున్నాడు. కానీ బన్నీ డైలాగులు వింటుంటే మాత్రం ఇతర నటుల ఫ్యాన్స్ మాత్రం తెగ చిరాకు పడుతున్నారు.

ఇదంతా పుష్ప మూవీ హైప్ కోసమే అంటున్నారు. పుష్ఫ సినిమా పై మనోడు బాగానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ బన్నీ అనుకున్నట్లు ఈ మూవీ హీట్ కాకుండా ఫట్ట్ అయితే పరిస్థితేంటీ…బన్నీ ఏమైపోతాడో అంటూ జనాలు ఎద్దేవా చేస్తున్నారు. పుష్ప సినిమా ప్రమోషన్ ఎక్కువైతుందంటూ సైటైర్లు వేస్తున్నారు. స్టార్ హీరోలు అన్నప్పుడు తక్కువగా కనిపించడం…తక్కువగా మాట్లాడితేనే…వారికి క్రేజ్ ఉంటుంది. అంతేకాదనీ నెలకు నాలుగు ఈవెంట్లలో కనిపిస్తూ…తమ క్రేజ్ చూపించుకునే ప్రయత్నం చేస్తే…. ప్రేక్షకులకు చిరాకు రావడం ఖాయం.