Allu Arjun Pushpaస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యొక్క పుష్ప తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో రెండు కీలకమైన షెడ్యూల్లను పూర్తి చేసింది. ఈ బృందం ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం తమిళనాడు తెన్కాసిలో ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్‌ను ఏప్రిల్ 8 న బన్నీ బర్త్‌డే స్పెషల్‌గా విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అంటే సినిమా విడుదలకు నాలుగు నెలల ముందు టీజర్ విడుదల అవుతుంది. సహజంగా ఇంత ముందుగా టీజర్ విడుదల చెయ్యరు. అయితే పుష్ప అల్లు అర్జున్ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. ఏదో అల్లాటప్పాగా కాకుండా సీరియస్ గా మిగతా మర్కెట్స్ లో సినిమాని ప్రమోట్ చెయ్యాలని బన్నీ ప్లాన్. అందుకోసమే పుష్ప ను మిగతా మర్కెట్స్ లోకి కూడా చేర్చడం కోసం ఎర్లీ గా టీజర్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం ఆగస్టు 13 న స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా విడుదలవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో బన్నీ చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడబోతున్నాడు.

అల్లు అర్జున్ గత ఏడాది ఆరంభంలో తన అల వైకుంఠపురంలో సూపర్ సక్సెస్ తర్వాత ఈ సినిమా ని అంతకంటే పెద్ద రేంజ్ కి తీసుకుని వెళ్ళాలని ఆసక్తిగా ఉన్నాడు. ఈ చిత్రం 180 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిందని, ఇది బన్నీ కెరీర్‌లో అత్యంత ఖరీదైనదిగా మారుతుందని వార్తలు వస్తున్నాయి.