Pushpa part 1Hindi Trailerఅల్లు అర్జున్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న “పుష్ప” సినిమా ప్రమోషన్స్ లో అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి. ట్రైలర్ విడుదల విషయంలో జరిగిన జాప్యత, ఆ పై ట్రైలర్ కు లభించిన స్పందన… ఇలా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ చిత్ర యూనిట్ లో టెన్షన్ వాతావరణం ఎక్కువవుతోంది.

పాన్ ఇండియా మూవీగా ఇప్పటికే ప్రమోషన్స్ చేసుకున్న ఈ సినిమా హిందీ ట్రైలర్ ను ఇప్పటివరకు రిలీజ్ చేయకపోవడం విశేషం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ లింక్స్ యూట్యూబ్ లో యాక్టివ్ కాగా, హిందీ ట్రైలర్ రిలీజ్ టైం గానీ, డేట్ గానీ ప్రకటించకపోవడంతో, హిందీలో విడుదలపై మళ్ళీ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హిందీలో విడుదల కావట్లేదంటూ ఇప్పటికే ఓ సారి ప్రచారం జరిగిన తర్వాత, సమస్యలు సర్దుమణిగాయి హిందీలో కూడా “పుష్ప” హంగామా ఉంటుందంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ బాలీవుడ్ నాట ప్రమోషన్స్ శూన్యం. కనీసం ట్రైలర్ ద్వారా అయినా ప్రేక్షకులకు చేరువ అవుతుందని భావించగా, ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ శ్రమపడిన వైనం ప్రతి షాట్ లో కనపడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఫేమ్ కావడానికి “పుష్ప”ను ఒక మార్గంగా ఎంచుకుని ఉండొచ్చు. కానీ సరైన ప్లానింగ్ లేకుండా ఎంత కష్టపడినా అది బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతుందన్న భయాన్ని బన్నీ ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ కు సరిగ్గా 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో, ‘కౌంట్ డౌన్’ ప్రారంభం అయినట్లే!