Allu--Arjunఈ ఏడాది మొదట్లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బన్నీ. అప్పటివరకూ కనీసం 90 కోట్ల షేర్ కూడా లేని బన్నీ ప్రభాస్ సినిమా తరువాత అతిపెద్ద హిట్ పెట్టేశాడు. ఆ తరువాత రంగస్థలం వంటి పెద్ద హిట్ ఇచ్చిన సుకుమార్ తో కలిసి పుష్ప అనే సినిమాకు శ్రీకారం చుట్టాడు. షూటింగ్ మొదలుపెడతాడు అనగా కరోనా వచ్చి పడింది.

దాదాపుగా తొమ్మిది నెలల పాటు షూటింగ్ మొదలుపెట్టలేని పరిస్థితి. ఎలాగోలా గత నెలలో షూటింగ్ మొదలు పెట్టారు. అయితే మొదటి షెడ్యూల్ పూర్తి కాకముందే మళ్ళీ షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ లో పాల్గొన్న డజన్ మందికి కరోనా సోకిందంట. ఒకతని పరిస్థితి సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్నాయి కూడా.

అయితే అతనికి కరోనా లేదని ఆ టీం అంటుంది. పుష్ప షూట్ దాదాపుగా 800 మందిని లొకేషన్ లో ఉంచి కొనసాగించారట. సామజిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం కుదరకపోవడంతో… కరోనా ప్రబలడానికి కారణం అయ్యి ఇప్పుడు షూటింగ్ ఆపెయ్యాల్సిన పరిస్థితి. తిరిగి ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.

ఎప్పుడు తిరిగి మొదలవుతుంది అనేదాని బట్టే వేసవికి వస్తుందా రాదా అనేది చెప్పే పరిస్థితి ఉంటుంది. ఈ పరిణామాలపై అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. అల వైకుంఠపురంలో భారీ విజయంతో అల్లు అర్జున్ కు దిష్టి తగిలిందని. అందువల్లే పుష్ప కు ఇన్ని అవరోధాలు ఎదురవుతున్నాయని వారు అనడం విశేషం.