Allu Arjun Pushpa Postersడిసెంబర్ 17వ తేదీన విడుదల కాబోతున్న సుకుమార్ – అల్లు అర్జున్ ల “పుష్ప” సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పోస్టర్స్ వెల్లువ కొనసాగుతోంది. నాడు అల్లు అర్జున్ లుక్ మొదలుకుని తాజాగా అనసూయ వరకు క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేస్తోన్న పోస్టర్స్ పై సోషల్ మీడియా జనులు పెదవి విరుస్తున్నారు.

మంచి ‘రా’ లుక్ తో రిలీజ్ అయిన అల్లు అర్జున్ లుక్ పై సర్వత్రా ఆసక్తి కనపరచగా, ఆ తర్వాత ఫాహద్ ఫాసిల్ పోస్టర్ లుక్ జస్ట్ పాస్ మార్కులు వేయించుకుంది. కానీ ‘మంగళం శీను’గా సునీల్ లుక్ తీవ్ర విమర్శలకు గురి కాగా, తాజాగా రిలీజ్ అయిన ‘దాక్షాయణి’ అనసూయ లుక్ కూడా నెట్టింట విమర్శలను కొని తెచ్చుకుంది.

‘రంగమ్మత్త’గా అనసూయకు సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని బ్రేక్ ఇచ్చిన సుకుమార్, మళ్ళీ అదే అనసూయకు ఎలాంటి అనుభవాన్ని ఇవ్వబోతున్నాడో తెలియాలంటే వచ్చే నెల 17వరకు వేచి చూడాలి గానీ, ఈ పోస్టర్స్ వెల్లువకు మాత్రం ‘పుల్ స్టాప్’ పెట్టడం సముచితమని పబ్లిక్ టాక్. ‘రా’ లుక్స్ పేరుతో మరీ ‘రంగస్థలం’ తీయడం లేదు కదా అన్నది అసలు సారాంశం.