Allu Arjun Prashant Neelప్రశాంత్ నీల్ దేశంలోనే హాట్ షాట్ దర్శకుడు ఇప్పుడు. కేజీఎఫ్ తో సెన్సేషన్ సృష్టించిన అతను కేజీఎఫ్ 2 తో ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమా విడుదలకు ముందే ప్రభాస్ తో సలార్ అనే మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు నీల్. ఇటీవలే ఆ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది.

ఇది ఇలా ఉండగా…. ప్రశాంత్ నీల్ ఉన్నఫళంగా ఈరోజు హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్దకు వచ్చి అల్లు అర్జున్ తో కూర్చున్నాడు. ప్రశాంత్ అక్కడ ఉండగా ఒక వీడియో కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీనితో అల్లు అర్జున్ తో అతని తదుపరి చిత్రం ఉంటుందా అనే చర్చ అంతటా నడుస్తుంది.

ఈ మధ్య అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాల మీద మక్కువ పెంచుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న పుష్ప చిత్రం అల్లు అర్జున్ కేరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా. పుష్ప తరువాత అల్లు అర్జున్ కొరటాల శివ తో సినిమా కమిట్ అయ్యాడు. సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

బన్నీ పుష్ప, కొరటాల సినిమాలు పూర్తి చేసి ఆ సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఊర మాస్ సినిమాలు చెయ్యడంలో ప్రశాంత్ నీల్ ఫేమస్… ఈ మధ్య కాలంలో బన్నీకు అటువంటి సినిమా పడలేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ లో సినిమా పడితే దానికి ఇక ఆకాశమే హద్దు అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.