His-Hair-Color-&-My-Skin-Have-Changed,-Not-Love---Allu-Arjunస్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో రిలీజ్ డేట్ మీద సస్పెన్స్ కొనసాగుతుంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం కుటుంబంతో సహా గోవా వెళ్లిన బన్నీ నిన్న రాత్రి తిరిగి వచ్చాడు. ఈరోజు లేక రేపు సినిమా రిలీజ్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ తరువాత బన్నీ తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడు.

గతంలో సుకుమార్ మహేష్ బాబు ఒక స్మగ్లింగ్ నేపధ్యంలోని ఒక స్క్రిప్ట్ చెప్పాడు. ఆ సినిమా అధికారికంగా ప్రకటించిన కొన్ని నెలల తరువాత ఆ సినిమాను అటకెక్కించారు. ఇప్పుడు అదే స్క్రిప్ట్ బన్నీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త గెట్ అప్ లో కనిపించబోతున్నాడు. రంగస్థలంలో రామ్ చరణ్ లాగా గుబురు గెడ్డంతో కనిపిస్తాడు.

అయితే లుక్ కొంత వెరైటీగా ఉండబోతుందంట. దీనికోసం ఇప్పటికే సుకుమార్ కొన్ని స్కెచ్లు తయారు చేయించాడు. అల వైకుంఠపురంలో విడుదల తరువాత వాటిని బన్నీ ట్రై చేస్తాడు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య బన్నీని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాతో బన్నీ పెద్ద స్టార్ గా ట్రాన్సఫార్మ్ అవుతాడేమో చూడాల్సి ఉంది.

శేషాచలం అడవుల నేపథ్యంలో ఉండే ఈ సినిమాను సుకుమార్ అక్కడే షూట్ చేద్దాం అని సుకుమార్ అనుకున్నాడు. అయితే అక్కడ పరిమిషన్స్ రాకపోవడంతో బ్యాంగ్ కాక్ అడవులలో షూట్ చెయ్యాలని సుకుమార్ అనుకుంటున్నాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో బన్నీ సరసన కనిపించనుంది.