Allu Arjun - New Lookస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్యాంగ్ కాక్ లో చిన్న హాలిడే పూర్తి చేసుకుని నిన్న హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తారసపడ్డ బన్నీ గుబురు గెడ్డం, పొడవు జుట్టుతో కనిపించాడు. ఇది సుకుమార్ తో తాను చెయ్యబోయే తదుపరి చిత్రం లుక్ కోసమని సమాచారం. ఇది బన్నీ కేరీర్ లో భారీ మేక్ ఓవర్ అని అంటున్నారు.

అల్లు అర్జున్ తన సంక్రాంతి సినిమా అల వైకుంఠపురంలో తో పెద్ద హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు 100 కోట్ల సినిమా లేని బన్నీ ఈ సినిమాతో 150 కోట్ల సినిమా పెట్టాడు. దీనితో రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాన్ని తొందరలో మొదలు పెట్టబోతున్నాడు. అంతకంటే ముందు చిత్తూరు యాసలో పర్ఫెక్ట్ గా మాట్లాడటానికి కోచింగ్ కూడా తీసుకోబోతున్నాడు.

ఈ సినిమా శేషాచలం అడవులలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ కు రంగస్థలం లాగా ఈ సినిమా బన్నీకి మేక్ ఓవర్ అవుతుందని అంటున్నారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య బన్నీని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాతో బన్నీ పెద్ద స్టార్ గా ట్రాన్సఫార్మ్ అవుతాడేమో చూడాల్సి ఉంది.

రష్మిక మందన్న ఈ సినిమాలో బన్నీ సరసన కనిపించనుంది. కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న తరుణంలో సుకుమార్ రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అనుకోకుండా ఆ సినిమా తరువాత భారీ గ్యాప్ వచ్చేసింది. అయినా ఇంకో హిట్ కొట్టి తన స్టామినాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు సుకుమార్.