Allu Arjun Naa -Peru Surya - Naa illu India-అధికారికంగా రిలీజ్ అయినపుడు వింటే కిక్ ఏముంటుంది? ముందుగానే లీక్ లో ఉండే ఆ కిక్కే వేరు అన్న చందంగా… అల్లు అర్జున్ నటించిన “నా పేరు సూర్య”లోని పాటను ముందుగానే లీక్ చేసేసారు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కావాల్సిన ‘సైనిక్’ సాంగ్ ను ఉదయం ఎనిమిది గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. అయితే ముందు రోజు అర్దరాత్రికే ఈ పాట ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడం విశేషం.

ముందుగా లీక్ చేసినా… అయినా… పాటలోని ఇంపాక్ట్ అయితే ఏం మారలేదు. గణతంత్ర్య దినోత్సవానికి పర్ ఫెక్ట్ సాంగ్ గా ఈ ‘సైనిక్’ పాట నిలుస్తోంది. బోర్డర్ లో ఉన్న జవాన్లందరికీ అంకితం ఇచ్చే విధంగా, వారి గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు. అలాగే బాలీవుడ్ ద్వయం విశాల్ – శేఖర్ ల సంగీతం తెలుగు నేటివిటీ లేకపోయినా, పాట యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో సాహిత్యం డామినేట్ చేసి ఆకట్టుకుంటోంది.

‘సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటి నిండా నిదురపోదురా…’ అంటూ ప్రారంభమైన ఈ పాటలో ‘ఓ సైనిక’ అంటూ ఆలపించే విధానం మాంచి ఊపు తెస్తుంది. మొత్తానికి “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా కాన్సెప్ట్ డివియేట్ కాకుండా, సరైన ప్రమోషన్స్ తో ముందుకు వెళ్తున్నారని ఈ పాట చెప్తుంది. ఇప్పటికే టీజర్ లో చూపించిన సన్నివేశాలకు మ్యాచ్ అయ్యే విధంగా ఈ పాట ఉంటుంది.