Allu Arjun - Mahesh Babuఎప్పుడూ 2012 నాటి రేట్లకు సంబంధించిన జీవో ఒకటి తెరమీదకు తెచ్చింది జగన్ ప్రభుత్వం. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా కుదేల్ అయిపోయింది. ఇరవై కోట్ల పైన బడ్జెట్ సినిమా ఇప్పుడు విడుదల చేసే సాహసం కూడా లేకుండా పోయింది.

మరోవైపు… చాలా ప్రయత్నించాకా ఎట్టకేలకు సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి ఇండస్ట్రీ పెద్దలకు అప్పాయింట్మెంట్ ఇచ్చారట. అయితే కేవలం నలుగురు మాత్రమే రావాలని ఒక మాట కూడా చెప్పిందట ముఖ్యమంత్రి కార్యాలయం. అందులో చిరంజీవి ఒకరు ఖచ్చితంగా వెళ్తారు.

మిగతా ముగ్గురు ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే మహేష్ బాబు, అల్లు అర్జున్ కూడా చిరంజీవి వెంట రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అయితే అలా వారిద్దరినీ తీసుకుని వెళ్తే… ఏదో ఇండస్ట్రీ అంటే పెద్ద సినిమాల, పెద్ద స్టార్ల వ్యవహారంలా అనిపించడం ఖాయం. పైగా మెగా ఫ్యామిలీ నుండి ఇద్దరు అవుతారు.

కాబట్టి అలా కాకుండా నిర్మాతలు, పంపిణీదారులు, అలాగే థియేటర్ ఓనర్ల నుండి ఒక్కొక్కరిని తీసుకుని వెళ్తే బెటర్ అని చిరంజీవి ఆలోచనట. ఇక ఈ భేటీకి మహేష్ బాబు, బన్నీ వెళ్లడం పై సోషల్ మీడియా విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీ ఇబ్బందుల గురించి కాకుండా జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే వీరు జగన్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు.