Allu Arjun Not Mingling with Other Heroes?‘గాడ్స్ ఒన్ కంట్రీ’గా పిలుచుకునే కేరళ తీరాన్ని ప్రస్తుతం వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రంలో ఎంతో మంది విగతజీవులు కాగా, మరెంతో మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఎవరికీ వారు వారికి తోచింది సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుండి ముందుగా విజయ్ దేవరకొండ 5 లక్షల రూపాయలను విరాళంగా అందించి పెద్ద మనసును చాటుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు అదే ట్రాక్ ను అనుసరిస్తుండగా, ఆ జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరారు.

కేరళలో సూపర్ స్టార్ డం ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్, తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయలను ఇస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కేరళలో సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ కూడా 25 లక్షలు ఇవ్వడంతో, స్థానిక హీరో ఇచ్చినంత మొత్తాన్ని అల్లు అర్జున్ ఇవ్వడం విశేషం. సినిమాలలో పోటీ సహజమే గానీ, ఇలా విరాళాల విషయంలో కూడా పోటీపడే విధంగా అందిస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. విజయ్ దేవరకొండ మొదలుపెట్టిన ఈ విరాళాల వెల్లువ చూడబోతుంటే భారీ సక్సెస్ అయినట్లుగానే భావించవచ్చు.