Allu Arjun inspired by karthiస్టయిలిష్ అల్లు అర్జున్ తన సంక్రాంతి సినిమా అల వైకుంఠపురంలో తో పెద్ద హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు 100 కోట్ల సినిమా లేని బన్నీ ఈ సినిమాతో 150 కోట్ల సినిమా పెట్టాడు. దీనితో రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాన్ని తొందరలో మొదలు పెట్టబోతున్నాడు. ఈ నెలలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడని సమాచారం.

అంతకంటే ముందు చిత్తూరు యాసలో పర్ఫెక్ట్ గా మాట్లాడటానికి కోచింగ్ కూడా తీసుకోబోతున్నాడు. ఈ సినిమా శేషాచలం అడవులలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఇందులో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడట. ఈ మధ్య కాలంలో వచ్చిన ఖైదీ సినిమాలో కార్తీ లారీ డ్రైవర్ గా నటించాడు.

ఆ సినిమాలో కార్తీ మొదటి నుండి చివరి వరకు లారీ నడుపుతూనే ఉంటాడు. ఆ సినిమాని బన్నీ చూస్తున్నాడట. అలాగే అవసరమైతే కార్తీతో కూడా మాట్లాడతాడట. రామ్ చరణ్ కు రంగస్థలం లాగా ఈ సినిమా బన్నీకి మేక్ ఓవర్ అవుతుందని అంటున్నారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య బన్నీని హీరోగా నిలబెట్టింది.

ఈ సినిమాతో బన్నీ పెద్ద స్టార్ గా ట్రాన్సఫార్మ్ అవుతాడేమో చూడాల్సి ఉంది. రష్మిక మందన్న ఈ సినిమాలో బన్నీ సరసన కనిపించనుంది. కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న తరుణంలో సుకుమార్ రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అనుకోకుండా ఆ సినిమా తరువాత భారీ గ్యాప్ వచ్చేసింది. అయినా ఇంకో హిట్ కొట్టి తన స్టామినాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు సుకుమార్.