Allu Arjun Icon Movie‘నా పేరు సూర్య’ తర్వాత సినిమా సినిమాకి ఎంతో జాగ్రత్త వహిస్తూ వస్తున్నాడు అల్లు అర్జున్. ‘అల వైకుంఠ పురములో’ , ‘పుష్ప’ తర్వాత కొన్ని సినిమాలు కమిట్ అయినప్పటికీ వాటి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ హోల్డ్ పెట్టేశాడు.

అందులో మెయిన్ గా ‘ఐకాన్’ సినిమా. ఈ సినిమా గురించి బన్నీ నుండి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. నిజానికి ఈ సినిమా ‘పుష్ప’ సెట్స్ పైకి వెళ్లే ముందు స్క్రిప్ట్ లాక్ అయింది. కథ విన్న వెంటనే సినిమా చేస్తున్నా ఎనౌన్స్ చేసుకోండి అంటూ దిల్ రాజు కి మాటిచ్చాడు అల్లు అర్జున్. కానీ అనుకోకుండా ‘పుష్ప’ రెండు భాగాలుగా తెరకెక్కనుండటంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. అయితే ఇటీవలే మేము రెడీ బన్నీ నుండి కన్ఫర్మేషన్ రావడమే ఆలస్యం సెట్స్ పైకి వెళ్లిపోతాం అంటూ చెప్పుకున్నాడు దిల్ రాజు. అంటే బన్నీ ఇంకా ఈ సినిమా గురించి ఎలాంటి డీసీషన్ తీసుకోలేదన్నమాట.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. బన్నీ నెక్స్ట్ రేస్ లో బోయపాటి కూడా ఉన్నాడు. ‘అఖండ’ షూటింగ్ టైంలోనే బన్నీ తో గీతా ఆర్ట్స్ లో సినిమా సైన్ చేశాడు బోయపాటి. తాజాగా నిర్మాతలు అల్లు అరవింద్ , బన్నీ వాస్ ఈ ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేశారు కూడా. బన్నీ లిస్ట్ లో మురుగదాస్ , ప్రశాంత్ నీల్ తో పాటు మరికొందరు కూడా ఉన్నారు. కానీ నెక్స్ట్ ఇమిడియట్ ప్రాజెక్ట్ లో మాత్రం ఇటు ‘ఐకాన్’ అటు బోయపాటి శ్రీను సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి ఐకాన్ మరోసారి పక్కన పెట్టి బన్నీ బోయపాటి కి నెక్స్ట్ చాన్స్ ఇస్తాడా ? వేచి చూడాలి.