Allu Arjun - Bollywoodస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సంక్రాంతి సినిమా అల వైకుంఠపురంలో తో పెద్ద హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు 100 కోట్ల సినిమా లేని బన్నీ ఈ సినిమాతో 150 కోట్ల సినిమా పెట్టాడు. ఆ ఊపులో సినిమా రిలీజ్ అయ్యి ఐదు వారాలు దాటుతున్నా సినిమా ప్రమోషన్స్ ఆపడం లేదు. తాజాగా బాలీవుడ్ మీద కన్నేశాడు బన్నీ.

వరుసగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో బన్నీ హిందీ సినిమాల్లో నటిస్తారా? అని అడిగిన ప్రశ్నకు స్పందించారు. “మంచి కథ వస్తే తప్పకుండా బాలీవుడ్‌ సినిమాలో నటిస్తాను. భారతీయ చిత్ర పరిశ్రమకు బాలీవుడ్‌ పెద్దన్నలాంటిది. దేశంలోని చాలా చిత్ర పరిశ్రమలు బాలీవుడ్‌ నుంచి స్ఫూర్తి పొందాయి. అక్కడ చాలా మంచి సినిమాలు తెరకెక్కుతాయి” అని బన్నీ తెలిపారు.

బాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు, తాజాగా ఈ స్టేట్మెంట్ ని బట్టి బన్నీ బాలీవుడ్ మీద కన్నేసినట్టే అనుకోవాలి. కాగా బన్నీ తన తరువాతి సినిమా సుకుమార్ కు చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శేషాచలం అడవులలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం.

రామ్ చరణ్ కు రంగస్థలం లాగా ఈ సినిమా బన్నీకి మేక్ ఓవర్ అవుతుందని అంటున్నారు. బన్నీ ఈ షూటింగ్ కు ఎంటర్ కావాల్సి ఉంది. కాగా… అల వైకుంఠపురంలో ప్రమోషన్స్ ఇప్పటికైనా ఆపుతారా లేక వచ్చే సినిమా విడుదల వరకు చేస్తూనే ఉంటారా అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు వినిపిస్తున్నాయి.