Prelude of Allu Arjun Pushparajఅల్లు అర్జున్ తదుపరి చిత్రం.. పుష్ప ‘ది ప్రీలూడ్ ఆఫ్ పుష్ప’ అంటూ టీజర్ లోని ఒక షాట్ ని నిన్న విడుదల చేసింది చిత్రబృందం. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇప్పుడు బన్నీ పుట్టినరోజు స్పెషల్‌గా ఏప్రిల్ 7 న సాయంత్రం 6.12 గంటలకు ఈ చిత్రం టీజర్ విడుదల కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల, చావు కబురు చల్లగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన అల్లు అర్జున్ పుష్ప గురించి ఒక మాట చెప్పమంటే – ‘తగేదే లే’ అని చిత్తూరు యాసలో అన్నాడు. ఆ డైలాగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అదే డైలాగ్ టీజర్‌లో కూడా ఉంటుందని, అభిమానులు ఈసారి మెంటలెక్కిపోతారని అంటున్నారు.

ఈ చిత్రం ఆగస్టు 13 న స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా విడుదలవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఒక టీచర్ ని పెట్టుకుని మరీ చిత్తూర్ యాసలో మాట్లాడటం నేర్చుకున్నాడట.

అల్లు అర్జున్ గత ఏడాది ఆరంభంలో తన అల వైకుంఠపురంలో సూపర్ సక్సెస్ తర్వాత ఈ సినిమా ని అంతకంటే పెద్ద రేంజ్ కి తీసుకుని వెళ్ళాలని ఆసక్తిగా ఉన్నాడు. ఈ చిత్రం 180 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిందని, ఇది బన్నీ కెరీర్‌లో అత్యంత ఖరీదైన సినిమాగా మారుతుందని వార్తలు వస్తున్నాయి.