Director Sukumar - Allu Arjunబన్నీకి సుకుమార్ లైఫ్ ఇచ్చాడు…అందులో డౌట్ లేదు ఎందుకంటే ఆర్య అనే సినిమా లేకపోతే బన్నీ అనే హీరో అంత పెద్ద స్టార్ అయ్యేవాడు కాదు. ఇక చెర్రీ విషయమే తీసుకుంటే చెర్రీకి ఎన్ని హిట్స్ వచ్చినా, యాక్టింగ్ పరంగా చెర్రీని టాప్ లెవెల్ లో నిలబెట్టింది మాత్రం ‘రంగస్థలం’ సినిమా అని చెప్పవచ్చు.

మరి అలాంటి సుకుమార్ తన సినిమాలో ఒక గెస్ట్ రోల్ చెయ్యమంటే కాదంటారా? ఏమో తెలీదు కానీ, ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే టాపిక్. మెగా శిబిరం నుంచి వస్తున్న మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాలో ఒక గెస్ట్ రోల్ కి ఒక హీరో కావలి. అయితే మెగా హీరో సినిమా కావడం, పైగా కొత్త హీరో కావడంతో మిగిలిన హీరోలు పెద్దగా ఒప్పుకోరు.

ఇక మెగా హీరోల్లో సాయి ధర్మ తేజ్ సిద్దంగానే ఉన్నాడు చెయ్యడానికి..కానీ ఇప్పుడు సాయి ఉన్న తీరు చేస్తే పూర్తి ఫ్లాప్స్ లో ఉన్నాడు..తాను ఈ రోల్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే ఈ రోల్ కోసం చెర్రీని, బన్నీని ట్రై చేస్తున్నాడు సుకుమార్. మరి వారు ఒప్పుకుంటారా లేదా అన్న మాటపై నడుస్తున్న చర్చ చివరకు ఏ ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఏది ఏమైనా…ఈ సినిమాలో మెగా హీరోలు ఎవరు ఎంటర్ అయినా…వైష్ణవ్ తేజ్ కి గ్రాండ్ ఎంట్రీ దొరికినట్లే.